రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్‌పై మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈరోజు ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ…ఉమ్మడి ఏపీలోనే కాకుండా విడిపోయిన తర్వాత ఏ పార్టీ సాధించని విజయం వైసీపీ సాధించిందని అన్నారు.
ఇక అప్పుడు ఎన్టీఆర్ కూడా ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని విజయం సాధించారని, జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేశారని గుర్తు చేశారు. అలాగే నిన్న ఢిల్లీలో ప్రధాని మోడీతో చర్చించి వచ్చిన తరువాత జగన్, మీడియాతో మాట్లాడిన వేళ తాను చూశానని, తనకు జగన్‌లో వైఎస్ స్పష్టంగా కనిపించారని అన్నారు.
మనసులోని మాటను బయటకు చెప్పేసే వైఎస్ నైజమే జగన్ లో కనిపించిందని ఉండవల్లి తెలిపారు. మోడీ కలిసి వచ్చిన తరువాత, ఆయనకు పూర్తి మెజారిటీ రాకూడదని కోరుకున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆ మాటలు చాలా మంచి గుణానికి సంకేతమని అన్నారు.
జగన్ ఇదే విధంగా వ్యవహరిస్తే మంచి జరుగుతుందని, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పడం, పారదర్శకతను పెంచుతానని అనడం జగన్ నిబద్దతకు సంకేతమని అభిప్రాయపడ్డారు.
చదవండి: జంపింగ్‌లు షురూ: వైసీపీలో చేరనున్న కర్నూలు టీడీపీ నేతలు..








