
లండన్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచ కప్‌కి సమయం దగ్గర పడింది. ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచ కప్ సమరం మొదలు కానుంది. మొదట ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇక టీమిండియా తన తొలి మ్యాచ్ జూన్ 5న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. అలాగే 16న పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో భారత్ చేతిలో వరుస పరాజయాల పరంపరకు పాకిస్థాన్ ఈసారి బ్రేక్ వేస్తుందని ఆ జట్టు చీఫ్ సెలెక్టర్, మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ అభిప్రాయపడ్డాడు.
ప్రపంచ కప్‌లో ఇరుజట్ల మధ్య ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు జరగ్గా…అన్నీ మ్యాచ్‌ల్లో భారత్‌నే విజయం సాధించింది. అయితే ఈసారి మాత్రం భారత జైత్రయాత్రకు బ్రేక్ వేస్తామనే నమ్మకం ఉందని ఇంజమామ్ ధీమా వ్యక్తం చేశారు.
అయితే ప్రపంచకప్ అంటే కేవలం ఈ ఒక్క మ్యాచే కాదని, మిగిలినా జట్లపై కూడా గెలువాల్సి ఉంటుందని వివరించాడు. ఇక ప్రపంచకప్‌లో ఏ జట్టును తక్కువ అంచనా వేసేందుకు లేదని, ఆఫ్ఘనిస్థాన్‌లాంటి జట్టు కూడా పెద్దపెద్ద జట్లను ఓడించగలదని, కాబట్టి ప్రతీ మ్యాచ్ ముఖ్యమే అని చెప్పాడు. అయితే ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లకు సెమీస్‌కు చేరే అవకాశం ఉందని హక్ చెప్పుకొచ్చాడు.








