జూలై 12న వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’…

- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో క్రేజీ దర్శకుడు పురి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ నటించిన గత సినిమాలకి భిన్నంగా ఈ సినిమా ఉండనుంది.

ఇక నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా…షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది.

పూరి తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా పురి ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. జూలై 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

అయితే కొంతకాలంగా రామ్‌కి .. పూరి జగన్నాథ్ లకి హిట్లు లేవు. దీంతో ఈ ఇద్దరు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా హిట్ కొట్టవలసిన అవసరం ఎంతయినా వుంది. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది.

చదవండి: హీరోగా మారిన సుడిగాలి సుధీర్…
- Advertisement -