మోడీ వ్యూహం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సుష్మస్వరాజ్…?

AP Governor News, Sushma Swaraj Latest, Narendra Modi Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరడంతో… కొత్త గవర్నర్ ను నియమించేందుకు యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతుండగా… ఏపీకి మాజీ విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

చదవండి: దేవినేని ఉమాపై కేశినేని పంచ్… కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి

పలు కారణాల వల్ల ఎన్నికల్లో పోటీ చేయని సుష్మస్వరాజ్ .. మోదీ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతల నిర్వహణలో మంచి మార్కులు కొట్టేశారు. కానీ… ఎన్నికల్లో బరిలో నిలవని కారణంగా ఆమెకు రెండో సారి మోడీ సర్కార్ లో స్థానం దక్కలేదు. దీంతో సుష్మాకు తగిన ప్రాధాన్యం ఉండేలా గవర్నర్ గా అవకాశాన్ని ఇవ్వనున్నట్లు సమాచారం.

ఏపీ ప్రభుత్వం నుంచి భవిష్యత్ లో నిధుల కేటాయింపు, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా లాంటి విషయాల్లో ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయాల్లో సర్కార్ ను కంట్రోల్ చేసేందుకు బీజేపీకి చెందిన గవర్నర్ ఉంటే బాగుంటుందని యోచిస్తోంది మోడీ సర్కార్. కావున ఏపీలో కొత్తగా ప్రభుత్వం కొలువు తీరగా కొత్త గవర్నర్ గా సుష్మస్వరాజ్ అడుగుపెట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా సుష్మస్వరాజ్ నియమితులు కానున్నారనే ప్రచారం ఎంత వరక కరెక్టో వేచి చూడాల్సిందే.

చదవండి: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటున్న గిరిజన నేత…
- Advertisement -