ఏపీలో జగన్.. తెలంగాణలో చంద్రబాబు! ఏం చేస్తున్నారో చూడండి…

YS Jagan Updates, Chandrababu Naidu Varthalu, AP Political Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: సార్వత్రిక ఎన్నికల తర్వాత బిజీ బిజీగా గడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు హైదరాబాద్‌ రానున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగే ప్రైవేట్‌ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అమరావతికి బయల్దేరి వెళ్తారు.

అయితే చంద్రబాబు పర్యటనలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని పార్టీ నేతలు చెబుతున్నా కాంగ్రెస్‌ నేతలతో సీఎం మంతనాలు జరిపే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎన్నికల బిజీలో పడిపోయిన బాబు పెద్దగా హైదరాబాద్ వైపు చూసింది లేదు.

ఏపీతో పాటు కేంద్ర రాజకీయాలపై కూడా దృష్టిపెట్టడంలో ఏపీ సీఎం బిజీగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.

చదవండి:  ఏపీలో జగన్ ప్రభావం అప్పుడే మొదలైందా? కసరత్తులు ప్రారంభించిన జిల్లా అధికారులు!

మంగళవారం కేబినెట్ భేటీ కూడా నిర్వహించారు. ఇందులో ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన కరువు, ఫణి తుఫాను పరిహారం, తాగునీటి సమస్య, ఉపాధి హామీ పథకాలపై మాత్రమే చర్చించారు. మరోవైపు అమరావతి నుంచి చంద్రబాబు హైదరాబాద్ వస్తుంటే అటు ప్రతిపక్ష నేత హైదరాబాద్ నుంచి తన పార్టీ మకాం మార్చేశారు.

మంగళవారమే ఆయన కడప జిల్లా పులివెందుకులకు చేరుకున్నారు. అక్కడ జగన్ పార్టీ నేతలతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జగన్ కడప జిల్లాలోనే పర్యటించనున్నారు.

చదవండి: లోటస్ పాండ్ టు అమరావతి.. జగన్ మకాం మార్చడానికి అసలు కారణం ఇదే!
- Advertisement -