చంద్రబాబుకు మరో షాక్! లక్ష్మీపార్వతి వేసిన కేసులో స్టే రద్దు, త్వరలో విచారణ…

chandrababu-lakshmi-parvathi-acb-court-illegal-assets-case
- Advertisement -

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మరో షాక్ తగిలింది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడ ఢంకా బజాయిస్తారో అనే టెన్షన్. మరోవైపు అధికారంలోకి వచ్చేది వైఎస్సార్సీపీయే గనుక.. అటుపోతే పోలా.. అనుకునే జంప్ జిలానీల బెడద.

చదవండి: చంద్రబాబుకి బిగ్ షాక్! ఫలితాల ముందే వైసీపీలో జాయిన్ కాబోతున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి!

మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెల్లగా పావులు కదుపుతోందని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలను పరిశీలిస్తోందనే వదంతులు.. ఈ బాధల జాబితాలో మరో కొత్త బాధ కూడా వచ్చి చేరింది. అదేమిటంటే.. గతంలో లక్ష్మీపార్వతి వేసిన ఓ కేసులో చంద్రబాబు తెచ్చుకున్న స్టే రద్దు అయింది. దీంతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది.

2005లో వేసిన కేసు…

విషయం ఏమిటంటే… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని, ఆయనపై విచారణ జరపాలంటూ 2005లో దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పట్లో లక్ష్మీపార్వతి వేసిన ఈ పిటిషన్‌పై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.

అయితే ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం అన్ని దిగువ కోర్టుల్లో దీర్ఘకాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి వేసిన కేసులో చంద్రబాబు తెచ్చుకున్న స్టే కూడా రద్దయింది. దీంతో ఆ కేసు విచారణ మొదలైంది.

చదవండి: ఏపీకి మరో తుపాన్ ముప్పు! భయపెడుతోన్న ‘ఫణి’, తమిళనాడు, కేరళలోనూ హై అలర్ట్…

ఈ మేరకు కేసు విచారణకు హాజరుకావాలంటూ ప్రస్తుత వైసీపీ నాయకురాలైన లక్ష్మీపార్వతికి హైదరాబాద్ ఏసీబీ కోర్టు నుంచి సమన్లు అందాయి. దీంతో శుక్రవారం ఆమె విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ ప్రారంభించిన ఏసీబీ కోర్టు, కేసు స్టేటస్‌పై వచ్చే నెల 13న విచారణ చేపడతామని హైదరాబాద్ ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -