28.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం బైక్‌పై స్నానం చేస్తూ ప్రయాణం.. వడ్డించిన పోలీసులు!

బైక్‌పై స్నానం చేస్తూ ప్రయాణం.. వడ్డించిన పోలీసులు!

- Advertisement -

వియత్నాం: ఏంటి?.. బైక్‌పై స్నానమా! అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. వాళ్లకేం అర్జెంటు పని ముంచుకొచ్చిందో కానీ, బైక్‌పైనే స్నానం చేస్తూ బయలుదేరారు. వియత్నాంలోని బింగ్ డుయాంగ్లో డౌ టియెంగ్ ప్రాంతంలో జరిగిందీ విచిత్ర ఘటన.

టియెంగ్ ప్రాంతంలో నివసిస్తున్నఇద్దరు వ్యక్తులు బైకుపై స్నానం చేస్తూ బయలుదేరారు. వెనక కూర్చున్న వ్యక్తి మధ్యలో ఉన్న బకెట్‌లోంచి నీళ్లు ముంచి తనపై పోసుకుంటున్నాడు. మధ్యలో బైక్ నడుపుతున్న వ్యక్తిపైనా నీళ్లు పోసి సబ్బు పెట్టి రుద్దుతున్నాడు. వారిని చూసిన ఇతర వాహనదారులు విస్తుపోయారు. వారు చేస్తున్న పనికి నవ్వాలో, ఏడవాలో తెలియక ఈ తతంగాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.

విషయం తెలిసిన పోలీసులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు రూ.5 వేల జరిమానా విధించారు. అలాగే, ఆ యువకులకు బైక్ ఇచ్చిన వ్యక్తికి రూ.4,300 జరిమానా విధించారు. స్నానం చేస్తూ ద్విచక్ర వామనం నడిపిన యువకుడిని హుయిన్ తన్‌ఖాన్హ్ (23)గా గుర్తించారు. అంతేకాదు వారి వద్ద కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని గుర్తించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -