25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం పిచ్చి పీక్స్‌కి చేరడమంటే ఇదే.. ఎంత లైవ్ కవరేజి అయితే మాత్రం ఇలానా?

పిచ్చి పీక్స్‌కి చేరడమంటే ఇదే.. ఎంత లైవ్ కవరేజి అయితే మాత్రం ఇలానా?

Pakistan Latest News, Pakistan Reporter News, Newsxpressonline
- Advertisement -

పాకిస్థాన్: న్యూస్ రిపోర్టర్లకి ఈ ప్రపంచలో ఒక గొప్ప స్థానం ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏమిజరిగినా మనకి తెలిసేది ఈ రిపోర్టర్ల వల్లే. కొన్ని కొన్ని సార్లు తమ ప్రాణాలని సైతం లెక్కచేయకుండా నిజం కోసం పోరాడుతారు. కాకపోతే అప్పుడప్పుడు కొందరు చేసే వికృత చేష్టల వల్ల నలుగురిలో అభాసుపాలౌతున్నారు. 

రిపోర్టర్లలో పాకిస్తాన్ రిపోర్టర్లు వేరయా, అనే నానుడి మరోసారి నిరూపితమైంది. గతంలో గాడిదల జనాభా పెరిగిపోతుందని చెప్పడం కోసం ఓ జర్నలిస్ట్ గాడిద మీద కూర్చొని రిపోర్టింగ్ చేయడం, ఆ గాడిద రిపోర్టర్ ను పడేయడం వైరల్ అయ్యింది. అలాంటి మరో ఘటన తాజాగా జరిగింది.పాకిస్తాన్ లో వరద తీవ్రత గురించి తెలియజేసేందుకు ఏకంగా ఓ రిపోర్ట్ ప్రవాహంలో దిగి రిపోర్టింగ్ చేయడం సంచలనమైంది. ఈయన పిచ్చి పీక్ స్టేజ్ కి చేరి ఇలా రిపోర్టింగ్ చేసిన వీడియో తెగ వైరల్ గా మారింది.

నైలా ఇనయత్ అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేసిన ఆ రిపోర్టర్ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఉదృత ప్రవాహంలో దిగి రిపోర్టింగ్ చేస్తున్న సదురు జర్నలిస్ట్ వీడియో చూసి ఇప్పుడు అందరూ తెగ నవ్వుకుంటున్నారు.దీన్ని పోస్ట్ చేసిన నైలా ఏ రిపోర్టర్ చేయని న్యూస్ తీసుకురా అని ఆదేశించగా.. పాపం రిపోర్టర్ ఇలా ప్రవాహంలో మునిగి రిపోర్టింగ్ చేశాడు అని క్యాప్షన్ తో సెటైర్ వేసింది. ఈ పోస్టు వైరల్ అయ్యింది.

 
అందరూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. వరదలో నువ్వు కూడా కొట్టుకుపోతే అప్పుడు నీ గురించి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది అని కొందరు, ఇలాంటి తలకు మాసిన ఆలోచనలు ఎలా వస్తాయో అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.
 

 

 
 
- Advertisement -