26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం కజకిస్థాన్‌లో కుప్పకూలిన విమానం.. 100 మంది దుర్మరణం?

కజకిస్థాన్‌లో కుప్పకూలిన విమానం.. 100 మంది దుర్మరణం?

- Advertisement -

నూర్-సుల్తాన్: కజకిస్థాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో వందమంది దుర్మరణం పాలయ్యారు. అల్‌మటీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. బెక్ ఎయిర్‌కు చెందిన ఈ విమానంలో వంద మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 95 మంది ప్రయాణికులు కాగా, మిగతా ఐదుగురు సిబ్బంది.

ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేనప్పటికీ అందులో ఉన్న అందరూ మృతి చెందినట్టు అనధికారిక సమాచారం. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు తీవ్రంగా గాయపడిన కొందరిని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. టేకాఫ్ అయిన విమానం విమనాశ్రయానికి సమీపంలో ఉన్న రెండంతస్తుల భవనాన్ని ఢీకొట్టినట్టు స్థానిక మంత్రి ఒకరు తెలిపారు.

అల్‌మటీ నుంచి దేశ రాజధాని నూర్-సుల్తాన్‌కు బయలుదేరిన కాసేపటికే విమానం నుంచి రాడార్ సంకేతాలు కోల్పోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విమనాశ్రయానికి సమీపంలోనే అది కూలినట్టు గుర్తించారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. దేశాధ్యక్షుడు కాసిం జోమార్ట్ టొకయేప్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -