22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం చైనాలోని వుహాన్‌లో మళ్లీ భయం భయం.. నగర ప్రజలందరికీ కరోనా పరీక్షలు

చైనాలోని వుహాన్‌లో మళ్లీ భయం భయం.. నగర ప్రజలందరికీ కరోనా పరీక్షలు

- Advertisement -

బీజింగ్: 76 రోజులపాటు కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా మారిన వుహాన్ నగరం ఎట్టకేలకు లాక్‌డౌన్ సంకెళ్లును ఛేదించుకుంది. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. 

గ‌త రెండు రోజుల నుంచి ఈ నగరంలో మళ్లీ పాజిటివ్ కేసులు బ‌య‌టపడుతున్నాయి. దీంతో న‌గ‌రంలో ఉన్న1.10 కోట్ల మంది జ‌నాభాకు క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు.

దీని కోసం న‌గ‌రంలోని అన్ని డివిజ‌న్ల‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ప‌ది రోజుల్లో మొత్తం జ‌నాభాకు ప‌రీక్ష చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

రెసిడెన్షియ‌ల్ ప్రాంతాల‌తో పాటు వైర‌స్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌రీక్ష‌లు ముమ్మ‌రం చేయాల‌ని భావిస్తున్నారు. వుహాన్‌లో ఏప్రిల్ 8వ తేదీన లాక్‌డౌన్ ఎత్తివేశారు.

అయితే మే 10, 11 తేదీల్లో కొత్తగా ఆరు కేసులు న‌మోదు అయ్యాయి. క్వారెంటైన్‌లో ఉన్న‌వారికి వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 

అది కూడా వారంతా ఒకే అపార్ట్‌మెంట్ కావ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నారు. జ‌న‌వ‌రి 23 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు వుహాన్‌లో లాక్‌డౌన్ విధించారు.  

చదవండి: వామ్మో.. ఇదేం ఐసోలేషన్ సెంటర్? సరైన తిండీ లేదు, శుభ్రత అంతకన్నా.. 70 ఏళ్ల వృద్ధుడు పరార్!
- Advertisement -