కరోనా దెబ్బకి బంకర్ల కోసం క్యూ కడుతున్న బిలియనీర్లు

- Advertisement -

వెల్లింగ్టన్: అదో లగ్జరీ ఫ్లాట్.. స్విమ్మింగ్ పూల్, జిమ్, ఫుల్లీ ఎయిర్ కండిషన్ తదితర అన్ని రకాల సౌకర్యాలూ అందులో ఉంటాయి.

ఇదేదో కొత్తగా కడుతున్న బిల్డింగ్‌లో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ సౌకర్యాలన్నీ ఉండేది భూమిలోపల.

సాధారణంగా బంకర్లు అనగానే యుద్ధంలో శత్రు సైనికుల దాడి నుంచి తప్పించుకోవడానికి ఏర్పాటు చేసుకునే భూ గృహాలే మనకు గుర్తొస్తాయి.

కానీ అందుకు పూర్తి భిన్నంగా ఇంద్రభవనాలను తలదన్నే విధంగా బంకర్లను నిర్మిస్తోంది న్యూజిలాండ్‌కు చెందిన ఓ స్టార్టప్ రియల్ ఎస్టేట్ కంపెనీ. అవే లగ్జరీ బంకర్లు. 

వీటి ధగధగలు ఎలా అయితే ఉన్నాయో ధరలు కూడా అదే స్థాయిలో ఆకాశాన్నంటుతున్నాయి. 

అయితే సాధారణంగా వీటికి డిమాండ్ ఎలా ఉంటుందో పక్కన పెడితే.. ప్రస్తుత కరోనా కాలంలో మాత్రం వీటికోసం అనేకదేశాల బిలియనీర్లు క్యూ కడుతున్నారు.

దీంతో వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. మూడు కోట్ల నుంచి 30 కోట్ల వరకు వీటి ధరలు ఉన్నట్లు న్యూజీలాండ్ కంపెనీ తెలుపుుతోంది.

అయినప్పటికీ తమ బంకర్లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని చెబుతోంది. 

ఇప్పటికే అమెరికాలోని ఫేస్‌బుక్‌, పేపాల్ వంటి సంస్థలకు చెందిన బిలియనీర్లు కొందరు వీటిని కోనుగోలు చేశారని, ఇతర దేశాలకు చెందిన వారు కూడా అనేకమంది అడ్వాన్సులు ఇచ్చారని చెప్పింది.

ఇదిలా ఉంటే ఈ బంకర్లలో కొన్ని రెండు, మూడు అంతస్తులుగా కూడా ఉంటాయి. అయినప్పటికీ లోపల ఉండేవారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా నిరంతరాయ ఆక్సిజన్ సదుపాయం ఉంటుంది.

సౌదీ అరేబియాకు చెందిన ఓ అరబ్ రాజయితే ఏకంగా 400 కోట్లు పెట్టి తనకు నచ్చినట్లుగా బంకర్‌ను నిర్మింపజేసుకుంటున్నారు. ఇందులో ఏకంగా హెలిక్యాఫ్టర్‌ దిగే వీలుంటుంది.

- Advertisement -