22.7 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం అమెరికాలో కాల్పులు: ఐదుగురు మృతి, హంతకుడి కాల్చివేత

అమెరికాలో కాల్పులు: ఐదుగురు మృతి, హంతకుడి కాల్చివేత

Illinois-firing
- Advertisement -

ఇల్లినాయిస్‌: అమెరికాలో తుపాకుల సంస్కృతి తాజాగా మరికొందరి ప్రాణాలను తీసుకుంది. ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్‌ పార్కు వద్ద ఓ వ్యక్తి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పోలీసు అధికారులతోపాటు పలువురికి గాయాలయ్యాయి.

ఈ దారుణ ఘటన పశ్చిమ చికాగోకు 65 కి.మీల దూరంలోని అరోరా ప్రాంతంలోని పైపులకు సంబంధించిన వాల్వుల తయారీ పరిశ్రమలో చోటుచేసుకుంది. అదే కంపెనీలో పనిచేసే గ్యారీ మార్టిన్‌ అనే వ్యక్తి ఈ కాల్పులకు తెగబడ్డాడు.

కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే స్పందించి ఆ ఉన్మాదిని హతమార్చారు. అయితే, ఆ వ్యక్తి కాల్పులు జరపడానికి గల కారణమేంటో తెలియరాలేదు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్‌లో 17 మంది చిన్నారులను ప్రాణాలను బలిగొన్న ఘటన జరిగి ఏడాది పూర్తయిన మరుసటి రోజే ఈ దారుణం చోటుచేసుకోవడం మరోసారి అమెరికాలో ఆందోళనకర పరిస్థితికి దారితీసింది.

కాగా, ఈ ఘటనలో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుభూతి తెలిపారు. అమెరికా మీకు అండగా ఉంటుందని చెప్పారు. హంతకుడ్ని తుదముట్టించిన అధికారులను అభినందించారు.

చదవండి: ఘోర ప్రమాదం: 10 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు సజీవదహనం! నిద్రలోనే పోయిన ప్రాణాలు…

- Advertisement -