22.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం విషాదం: కొలంబోలో బాంబు పేలుళ్లు.. 156 మంది మృతి! ఈస్టర్ రోజునే…

విషాదం: కొలంబోలో బాంబు పేలుళ్లు.. 156 మంది మృతి! ఈస్టర్ రోజునే…

colombo-church-easter-bomb-blast
- Advertisement -

కొలంబో: శ్రీలంకలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కొలంబోలోని మూడు చర్చిల్లో, మరో మూడు స్టార్ హోటళ్లలో బాంబు దాడులకు పాల్పడ్డారు. ఆదివారం ఈస్టర్ పండుగ కావడంతో ఆయా చర్చిలలో ప్రార్థనల నిమిత్తం వచ్చే వారిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బావిస్తున్నారు.

కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్‌ ఆంథోనీ చర్చిలో, అలాగే కథువాపితియాలోని కటానా చర్చిలో బాంబు పేలుళ్లు జరిగినట్లు.. షాంగ్రి లా హోటల్‌, కింగ్స్‌ బరీ హోటల్‌లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. 

మృతుల్లో 35 మంది విదేశీయులు…

ఈ బాంబు పేలుళ్లలో 156 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రదాడుల అనంతరం శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది.

మరోవైపు సహాయక బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

కొలంబోలో ఉగ్రదాడులపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. అక్కడి భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని, బాంబు పేలుళ్ల అనంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు.

- Advertisement -