నయనతారకు డైరెక్టర్ పెళ్లి ప్రపోజల్…. రిలేషన్ బట్టబయలు!

- Advertisement -

సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వీరు తమ రిలేషన్ గురించి అఫీషియల్‌గా వెల్లడించక పోయినా…. ఇద్దరూ కలిసి చెట్టాపట్టలేసుకుని తిరుగడం ద్వారా తాము డీప్ రిలేషన్లో ఉన్నామనే సంకేతాలు అభిమానుల్లోకి పంపుతున్నారు. త్వరలో వీరి పెళ్లి జరుగబోతోందని తెలుస్తోంది. విఘ్నేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు అర్థం అదే అని చర్చించుకుంటున్నారు.

తాజా విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. నయనతార నటించిన ‘కొలమావు కోకిలా’ మూవీలోని వివాహానికి సంబంధించిన సాంగ్ లిరిక్ గురించి విఘ్నేష్ తన పోస్టులో ప్రస్తావించారు. ప్రియురాలు నయనతారతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేస్తూ….. ఇది తమకు రైట్ సాంగ్, ఈ పాటను అందించిన సంగీత దర్శకుడు అనిరుధ్‌కు థాంక్స్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఈ పోస్టు చేయడం ద్వారా అందరికీ తెలిసేలా విఘ్నేష్ శివన్ తన ప్రియురాలు నయనతారకు పెళ్లి ప్రపోజల్ చేశారని, త్వరలోనే వీరు వివాహ బంధం ద్వారా ఏకం కాబోతున్నారు అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.  త్వరలోనే నయనతార, విఘ్నేష్ శివన్ తమ పెళ్లిపై అఫీషియల్ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం నయనతార తన చేతిలో ఉన్న సినిమా కమిట్మెంట్లు పూర్తయిన ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు టాక్.

పెళ్లి తర్వాత కూడా నటిగా కంటిన్యూ అయ్యేలా నయనతార తన కెరీర్ ప్లాన్ చేసుకుంటోందట. ప్రస్తుతం నయనతార తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’ మూవీతో పాటు తమిళంలో పలు చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

- Advertisement -