26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home క్రికెట్ వన్డే ఫార్మాట్‌లో ధోనీని మించిన ఆటగాళ్లు లేరు: రవిశాస్త్రి

వన్డే ఫార్మాట్‌లో ధోనీని మించిన ఆటగాళ్లు లేరు: రవిశాస్త్రి

MS Dhoni3
- Advertisement -

ముంబై: మే 30 నుంచి వన్డే వరల్డ్ కప్ సమరం మొదలు కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ…. వన్డే ఫార్మాట్‌లో ధోనీని మించిన ఆటగాడు ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో మరొకరు లేరని అన్నాడు.

మైదానంలో ధోనీ చేసే చిన్న చిన్న పనులు కూడా జట్టుకి ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పారు. ఏన్నో ఏళ్లుగా వికెట్ల వెనుక అతడు మాయ చేస్తూ వస్తున్నాడని, ఈ ఫార్మాట్‌లో ధోనీని మించిన ఆటగాళ్లు లేరని అన్నారు.

ఇక క్యాచ్‌లు పట్టడం మాత్రమే కాదు.. స్టంపింగ్స్, రనౌట్‌ల విషయాల్లో అతడికి అతడే సాటి అన ధోనీని పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే గత ఐదేళ్ళుగా భారత్ నిలకడైన క్రికెట్ ఆడుతున్నదని, ఏదో కొత్తగా చేయాలని బొక్కబోర్లా పడాలనుకోవడం లేదని, జట్టు సమిష్టిగా రాణిస్తే వరల్డ్‌కప్ టీమ్‌ఇండియాదే అని ఆశాభావం వ్యక్తంచేశాడు.

ప్రతి మ్యాచ్ కీలకమే..

ఇక కోహ్లీ మాట్లాడుతూ… వరల్డ్ కప్‌లో ప్రతి మ్యాచ్ కీలకమే అని, సామర్థ్యం మేరకు మెరుగైన క్రికెట్ ఆడటంపైనే దృష్టిపెట్టాలని చెప్పాడు. తన వరకైతే ఒక జట్టు మిగిలిన అన్ని జట్లతో ఆడాల్సి రావడం మంచి విధానమని పేర్కొన్నాడు. అయితే మొదటి మ్యాచ్ నుంచే అందరు తమ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాలని చెప్పుకొచ్చాడు.

చదవండి: రిటైర్మెంట్ తర్వాత పెయింటింగ్స్ వేస్తానంటున్న ధోనీ…..
- Advertisement -