చిత్రలహరి టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

When is the Chitralahari's teaser release? Newsxpressonline

హైదరాబాద్: మెగా హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ రూపొందుతోంది. కల్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, సునీల్, వెన్నెలకిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

దేవిశ్రీ సంగీతం ప్రత్యేక ఆకర్షణ…

వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు.రేపు ఉదయం 9 గంటలకు టీజర్ ను వదలనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే దర్శకుడు కిషోర్ తిరుమల వున్నాడు. ప్రేమకథా చిత్రాలను యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఆయన చాలా బాగా తెరెకెక్కిస్తారనే పేరుంది.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం యూత్ మనసులను కొల్లగొట్టేస్తుందని అంటున్నారు. వరుస పరాజయాలతో డీలాపడిన తేజు, ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కనుక తేడా జరిగితే తేజు భవిష్యత్ మీద చాలా ప్రభావం చూపడం మాత్రం ఖాయం.