
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా….అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇక శుక్రవారం కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
దిల్ రాజు, రామ్ బ్రహ్మం సుంకరలు నిర్మాతలుగా వ్యహరిస్తున్న ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా చేస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ మరోసారి మహేశ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా దాదాపు 13 ఏళ్ల తర్వాత సీనియర్ నటి విజయశాంతి మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు. ఇక దీనిపై విజయశాంతి స్పందిస్తూ… 13ఏళ్ల తరవాత మళ్లీ సినిమాల్లోకి వస్తూ మహేశ్‌బాబు సినిమాలో నటించడం సంతోషంగా ఉందని అన్నారు.
ఈ అవకాశాన్ని ఓ బాధ్యతగా భావిస్తానని విజయశాంతి పేర్కొన్నారు. తనకు ఇప్పటికీ సినిమాల పట్ల అంకితభావం ఉందని, వృత్తి పట్ల గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఇక ఇందులో విజయశాంతితో పాటు జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌లో కీలక పాత్రల్లో చేస్తున్నారు.








