‘మహర్షి’ ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ, వెంకటేష్!

3:24 pm, Wed, 1 May 19
Maharshi Movie Latest News, Vijay Devarakonda News, Venkatesh News, Newsxpressonline

హైదరాబాద్: సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనిదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. ఇప్పటికే అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న మహర్షి మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ మహేష్ 25వ సినిమా కూడా కావటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు మరింత పెంచేలా భారీ ప్రీ రిలీజ్‌ కు ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్‌. బుధవారం సాయంత్రం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

ఈ ఈవెంట్‌కు సీనియర్‌ హీరో వెంకటేష్‌తో పాటు యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అంతేకాదు మహేష్‌తో గతంలో వర్క్‌ చేసిన దర్శకులలో చాలా మంది ఈ వేడుకకు హాజరవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

చదవండి:  ‘మా’ నూతన కార్యవర్గం భేటీ! తొలి సమావేశంలోనే.. సంచలన నిర్ణయాలు!