26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ వరుణ్ తేజ్ కారుకి యాక్సిడెంట్..ఆందోళనలో మెగా ఫ్యాన్స్

వరుణ్ తేజ్ కారుకి యాక్సిడెంట్..ఆందోళనలో మెగా ఫ్యాన్స్

Varun Tej Latest News, Valmiki Movie Updates, Telugu Movie News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: Varun Tej .

అభిమానులు ఆందోళన చెందవద్దని సన్నిహితులు వెల్లడించారు. వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద రోడ్డు ప్రమాదానికి గురైందని సన్నిహితులు తెలిపారు. కారు పూర్తిగా డామేజ్ అయింది. వరుణ్ తేజ్‌కు ఎమీ కాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందవద్దు అని సన్నిహితులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు అని తెలిపారు. రోడ్డుపై ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం జాతీయ రహదారి రాణిపేట సమీపంలో వరుణ్ ప్రయాణిస్తున్న ఆడి కారు ఇండికా కారును ఢీకొన్నది.

ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో హీరో వరుణ్ తేజ్‌కు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా NH44పై ఈ ప్రమాదం జరిగింది. వరుణ్ తేజ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు అని మీడియా వర్గాలు వెల్లడించాయి.

వరుణ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త మెగా క్యాంపులో ఆందోళన లేవనెత్తింది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన సన్నిహితులు ప్రమాదంపై క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. మీడియా వర్గాలు కూడా ఈ వార్తను ధృవీకరించాయి. వాల్మీకి షూటింగ్ కోసం కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

చదవండి: మెగాస్టార్ చిరు చిన్నల్లుడికి ఆకతాయిల వేధింపులు

- Advertisement -