హైదరాబాద్: సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ ఎంపిక చేసుకొనే చిత్రాల కథలు వేటికి అవే భిన్నంగా ఉంటాయనేది అందరికి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న డియర్ కామ్రేడ్‌లో స్టూడెంట్ లీడర్‌గా నటిస్తున్నాడు. తాజాగా పట్టాలెక్కిన హీరో చిత్రం బ్యాక్ డ్రాప్ చాలా ఆసక్తికరంగా ఉందనే విషయం ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇస్తున్నది.
గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా టైటిల్‌తో వస్తున్న హీరో సినిమా కథా నేపథ్యం ఏమిటంటే..ప్రస్తుతం దర్శకుడు క్రాంతి మాధవ్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే మైత్రీ మూవీస్ రూపొందించే హీరో సినిమాను పట్టాలెక్కించాడు. శనివారం జరిగిన ముహుర్తం షాట్‌కు కొరటాల శివ, హీరోయిన్ మాళవిక మోహనన్ తదితరులు హాజరయ్యారు.
అత్యంత నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, మాళవికపై తొలిషాట్‌కు కొరటాల శివ క్లాప్ కొట్టారు.ఇక హీరో సినిమా కథా నేపథ్యం మ్యూజిక్ థ్రిల్లర్ అని తెలిసింది. అలాగే మ్యూజిక్‌తోపాటు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో కిక్కెంచే సబ్జెక్ట్‌ను దర్శకుడు ఆనంద్ అన్నామలై రెడీ చేసినట్టు సమాచారం. గతంలో అర్జున్ రెడ్డిలో కాసేపు ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఏ రకమైన స్పోర్ట్స్‌ను బ్యాక్‌డ్రాప్‌గా తీసుకొన్నారనేది తెలియడం లేదు.








