25.3 C
Hyderabad
Sunday, November 8, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసిన యువ హీరోయిన్!

అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసిన యువ హీరోయిన్!

Allu Arjun Latest News, Telugu Movie News, Tollywood Latest News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా తొలి షూటింగు పూర్తయింది. త్వరలోనే రెండవ షెడ్యూల్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు.

రెండవ కథానాయికగా కేథరిన్ ను తీసుకునే ఆలోచనలో వున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ‘కేతిక శర్మ’ పేరు తెరపైకి వచ్చింది. ఈ అమ్మాయిని తీసుకునే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ తనయుడు హీరోగా రూపొందుతోన్న ‘రొమాంటిక్’ సినిమాలో కథానాయికగా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయం కానుంది. అల్లు అర్జున్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకి ఈ అమ్మాయి అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావించడంతో, ఆయన టీమ్ సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా సమాచారం. అల్లు అర్జున్ జోడీగా ఛాన్స్ పట్టేసిందంటే మాత్రం అదృష్టవంతురాలే!

- Advertisement -