షాకింగ్: టాలీవుడ్ హీరోయిన్లతో అమెరికాలో సెక్స్‌రాకెట్! ఓ తెలుగు నిర్మాత‌, ఆయ‌న భార్య నిర్వాకం…

man-arrest-for-burried-his-wife-alive
- Advertisement -

man-arrest

ఓ తెలుగు నిర్మాత‌, ఆయ‌న భార్య అమెరికాలో సెక్స్ రాకెట్‌లో దొరికిపోవడం సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సెక్స్ రాకెట్‌ను అమెరికా ఫెడరల్ ఏజెన్సీ పోలీసులు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. కిష‌న్ మోదుగుమూడి అలియాస్ విభా జ‌యమ్, అతడి భార్య చంద్ర మోదుగుమూడి చికాగో కేంద్రంగా సెక్స్ రాకెట్ న‌డిపించ‌డం అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

చదవండి: సెక్స్ రాకెట్ కేసు: ప్రముఖ నటి అరెస్ట్, మరికొందరు సినీ ప్రముఖుల హస్తం!

ఈ కేసుకు సంబంధించి 42 పేజీల నివేదిక‌ను షికాగో జిల్లా కోర్టులో స‌మ‌ర్పించ‌డంతో ఈ షాకింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.  చాలా కాలంగా ఈ సెక్స్ రాకెట్ న‌డుపుతున్న కిష‌న్ తెలుగు హిట్ సినిమాల‌కి కో ప్రొడ్యూస‌ర్‌గా కూడా వ్య‌వ‌హరించాడు. సినిమా షూటింగ్‌లు, ఈవెంట్స్ పేరుతో పలువురు టాలీవుడ్ హీరోయిన్లు, యాంకర్లను తాత్కాలిక వీసాపై అమెరికాకి తీసుకెళ్ళ‌డం, అక్క‌డ వారిని ఖ‌రీదైన హోటల్స్‌లో ఉంచి వారి వద్దకు విటుల‌ని పంప‌డం వీరి ప్రవృత్తిగా మారిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్లు తాత్కాలిక వీసాల మీద అమెరికా వ‌చ్చి వీరి నేతృత్వంలో వ్య‌భిచారం సాగించిన‌ట్టు స్థానిక పత్రిక వెల్ల‌డించింది.

హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో ఉంచి కిషన్, చంద్రలు.. వారి వద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, వారితో స్వల్ప సమయం గడిపేందుకు కస్టమర్ల నుంచి 3 వేల డాలర్లు (దాదాపు 2 ల‌క్ష‌ల రూపాయ‌లు) వసూలు చేసే వారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.  కిష‌న్ మోదుగుమూడి అలియాస్ విభా జ‌యమ్, అతడి భార్య చంద్ర మోదుగుమూడిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో మరింత దర్యాప్తు జరుపుతున్నామని, త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు వెల్ల‌డించనున్నట్లు తెలిపారు.

ఓ హీరోయిన్ మెయిల్‌తో…

క్రిస్‌మ‌స్ సంద్భంగా గతేడాది ఓ యువ హీరోయిన్‌ను అమెరికాకు ర‌ప్పించి వ్య‌భిచారం నిర్వ‌హించ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.  ‘‘న‌న్ను మాన‌సిక క్షోభ గురి చేయొద్దు,  ఇలాంటి బిజినెస్‌లో నన్ను భాగం చేయొద్దు..’’ అంటూ ఆ హీరోయిన్ వేడుకున్న మెయిల్ ఒక‌టి తమ ద‌ర్యాప్తులో దొరికింద‌ని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించినంత‌వ‌ర‌కు ఆ హీరోయిన్‌ను.. ఫెడ‌ర‌ల్ పోలీసులు బాధితురాలిగానే చూస్తున్నారు. ఆమెను `విక్టిమ్‌-ఎ`గా పేర్కొంటున్నారు.

ఇక‌, కిష‌న్ భార్య చంద్ర ఈ సెక్స్ రాకెట్‌కు సంబంధించి లెక్క‌లు రాసుకోవ‌డం, విటుల‌తో డ‌బ్బులు గురించి మాట్లాడ‌డం వంటి విష‌యాల‌ను డీల్ చేసేద‌ట‌. ఆమె ఫోన్ ద్వారానే విటుల‌తో బేర‌సారాలు సాగించేద‌ట‌. ఈ నేపథ్యంలో చికాగో పోలీసులు కిషన్, అతడి భార్య చంద్రల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వారి సోష‌ల్ నెట్‌వర్క్ అకౌంట్లతోపాటు మెయిల్స్‌ని కూడా చెక్ చేస్తున్న‌ట్టు సమాచారం.  మరోవైపు కిష‌న్ ఇంటిపై దాడి చేసిన‌పుడు అక్క‌డున్న ఓ బ్యాగ్‌లో 70 కండోమ్‌లు దొరికాయ‌ని పోలీసులు కోర్టుకు స‌మ‌ర్పించిన నివేదిక‌లో పేర్కొన్నారు.  ఈ కేసుపై పూర్తి విచార‌ణ జ‌రిపి అన్ని విష‌యాలు మీడియాకి వివ‌రిస్తామ‌ని వారు పేర్కొన్నారు.

 

- Advertisement -