హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో ఘన విజయం అందుకొని ఇప్పుడు తన తదుపరి సినిమా ‘మహర్షి’ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ‘మహర్షి’ సినిమా తరువాత మహేష్ బాబు.. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో ఒక సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు జొరుగా వినిపించాయి. కానీ ఇప్పుడు మహేష్ బాబు ఆలోచన మారినట్లు సమాచారం.
కొద్దిరోజులుగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మహేష్ బాబు సినిమా చేయబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సినిమాకి దర్శకుడిగా ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ రెడ్డి వంగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే దర్శకుడుగా సందీప్ రెడ్డి కాకుండా క్రిష్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం క్రిష్.. బాలకృష్ణ నిర్మించి, నటిస్తోన్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే మహేష్ బాబు సినిమా వర్క్ ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది. వాస్తవానికి దగ్గరగా వుండే సినిమాలు తీసే క్రిష్.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.