
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఇప్పటివరకు కనిపించని విధంగా కనిపించబోతున్నాడు అని సమాచారం. ఈ సినిమాని వేసవి కానుకగా మే 9 న రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ఫిక్స్ అయింది. ఇకపోతే ఈ మహర్షి తరువాత సుకుమార్ తో సినిమా ఉంటుంది అని ఈ మధ్య ఒక వార్త తెగ హల్ చల్ చేసింది.
పూర్తి కథపై కసరత్తు..
సుకుమార్ తో చేయాలనుకున్న ప్రాజెక్టు చివరి నిమిషంలో పక్కకి పోవడంతో, మహేశ్ బాబు ఆలోచనలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఒక దర్శకుడితో ఒక ప్రాజెక్టును గురించి మాత్రమే చర్చిస్తూ కూర్చుంటే, ఆ ప్రాజెక్టు ఆగిపోతే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన మహేశ్ బాబు, ఇద్దరు ముగ్గురు దర్శకులను లైన్లో పెట్టాలనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా చెప్పుకున్నారు.
అందులో భాగంగానే ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి కబురు వెళ్లడం. ఆయన వచ్చి మహేశ్ శ్రీమతి నమ్రతకి లైన్ వినిపించడం జరిగిపోయాయట. ప్రశాంత్ నీల్ చెప్పిన లైన్ నమ్రతకి నచ్చిందట. పూర్తి కథను సిద్ధం చేసుకుని రమ్మని ఆమె చెప్పినట్టుగా సమాచారం. త్వరలోనే ఆయన పూర్తి కథను మహేశ్ బాబుకి వినిపించనున్నాడని అంటున్నారు. మహేశ్ బాబుకి కథ నచ్చితే, ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తుంది.
చదవండి:కళ్యాణ్ రామ్ 118 పై మహేష్ బాబు హాట్ కామెంట్స్!








