
తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త నీరు వస్తోంది. చిత్ర చిత్రానికి ఆ ప్రవాహం ఒక స్థాయిలో ఉంటోంది. అయితే ఇప్పుడొక కొత్త చిత్రం వరద నీటిలా.. సుడులు తిరుగుతూ పోటెత్తిమరీ వస్తోంది. ఆ ప్రవాహగమనంలో ఎన్నో సవాళ్లు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఒత్తిళ్లనెదుర్కొని.. సరిగ్గా ఆగస్టు 15న ప్రి-లుక్ పోస్టరు విడుదలైంది.
ఆ సినిమా… ‘స్టోరీ ఆఫ్ భీమాల్ ’..
టైటిల్ దగ్గర నుంచి.. మొదటి పోస్టరు వరకు ఒక డిఫరెంట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన యువదర్శకుడు నారాయణమూర్తి బల్లెడ.,ఆ పోస్టరులో ఒక క్యాప్షన్ సంచలనాత్మకంగా పెట్టాడు..అదేమిటంటే ’ సినిమా బాగాలేదని ఒక్కరన్నా..మరొకటి చేయం’.. ఇప్పుడీ క్యాప్షన్ పై, సినీ ఇండస్ట్రీలో సామాజిక వేదికపై ఒక తీవ్ర చర్చ జరుగుతుంది.
’అసలేముంది సినిమాలో..’ ’ఎంత గొప్పగా తీశాడని అంత ధైర్యంగా చెబుతున్నాడు..’ ఇంత కచ్చితంగా చెబుతున్నాడంటే ఇందులో ఏదో విషయం ఉంది’ ఇలాంటి కామెంట్లు అన్నీ వినిపిస్తున్నాయి. ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
డిఫరెంట్ లుక్‌తో.. ప్రి-లుక్ పోస్టర్
ప్రి లుక్ పోస్టర్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఒక పాత సువేగా స్కూటర్..దానిపై ఎప్పటిదో పాతకాలం నాటి చెక్క తుపాకి, వెనుక నాలుగైదు ఆయుధాలు, ఆ సీటుపై ఒక మనిషి వాడే కూలింగ్ కళ్లద్దాలు, ఒక పాత గళ్ల టవల్, విషయాన్ని సూటిగా కాకుండా..ఒక ఆర్టిస్టిక్ వ్యూ తో పోస్టర్ ద్వారానే తన ప్రత్యేకతను చూపించడం..ఈ సినిమాలో ఏదో సంగతి ఉందని చెప్పకనే చెబుతోంది.
’స్టోరీ ఆఫ్ భీమాల్’ దర్శకుడు నారాయణమూర్తి బల్లెడ
’స్టోరీ ఆఫ్ భీమాల్’ దర్శకుడు నారాయణమూర్తి బల్లెడ పూర్వాశ్రమంలో జర్నలిస్టు, శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం బాధితుల వేదనలపై..ఒక సామాజిక ఇతివృత్తంతో ’ ఉద్ధానం‘ అనే ఊరి పేరుతోనే రాసిన గొప్ప పుస్తకం .. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసలు అందుకుంది.
పవన్ కల్యాణ్ ఉద్దానం బాధితుల గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు.. ఈ పుస్తకం ద్వారా తనకెంతో విలువైన సమాచారం దొరికిందని పవన్ చెప్పడం.. దర్శకుడు నారాయణమూర్తి బల్లెడ ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం లేదు.
బుక్ రీడింగ్‌లో పవన్ కల్యాణ్ కి ఉన్న అభిరుచి అందరికి తెలిసినదే. అలాంటి వ్యక్తి ఈ దర్శకుడు రాసిన పుస్తకానికి కితాబు ఇవ్వడం..ఇప్పుడు వచ్చే కొత్త సినిమా ’స్టోరీ ఆఫ్ భీమాల్ ’ని ప్రశంసించడం విశేషం.
దర్శకుడు బేసిక్ గా జర్నలిస్టు కావడంతో …
సామాజిక సమస్యల ఇతివృత్తంగా కథలు ఎన్నుకుంటాడని అర్థమవుతోంది. ఛత్తీస్ ఘడ్ లోని సల్వాజుడుం వ్యవస్థ..పై.. పోలీసులు అందించిన కీలకమైన సమాచారంతో.. నిజ జీవితాలతో, వాస్తవ సంఘటనల ఆధారంగా ఎంతో శ్రమకోర్చి..భయంకరమైన అడవుల్లోకి వెళ్లి తీసిన.. గొప్ప సినిమా.. ’ స్టోరీ ఆఫ్ భీమాల్‘ అని చెప్పాలి.
ఇది దర్శకుడికి మొదటి చిత్రం..ఇందులో నటీనటులు అందరూ కొత్తవారే.. ప్రొడ్యూసర్లు అందరూ కొత్తవారే.. మరి కొత్తవాళ్లందరూ కలిసి చేసిన కొత్త ప్రయోగం విజయవంతమవుతుందని ఆశిద్దాం.
– శ్రీనివాస్ మిర్తిపాటి









Nice article.. All the best to the “Story of Bheemal” team. Eagerly waiting for the movie.