29.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ సీఎంగా తొలిసారి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వైఎస్ జగన్!

సీఎంగా తొలిసారి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వైఎస్ జగన్!

ys-jagan-flag-hosting-as-cm
- Advertisement -

విజయవాడ: 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తొలిసారిగా సీఎం హోదాలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

అనంతరం ఓపెన్ టాప్ వాహనంపై స్టేడియంలో తిరుగుతూ ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు, ప్రజలకు సీఎం జగన్ అభివాదం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు. అలాగే రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

అలరించిన శకటాల విన్యాసాలు…

ఈ వేడుకలలో ఏపీ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 13 శాఖల శకటాల విన్యాసాలు ప్రజలను అలరించాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులతో పాటు పలువురు మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

- Advertisement -