26.7 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ఎంపీ కవిత చేతులమీదుగా.. ‘ఏది పవిత్ర యుద్ధం?’ షార్ట్ ఫిల్మ్ రిలీజ్…

ఎంపీ కవిత చేతులమీదుగా.. ‘ఏది పవిత్ర యుద్ధం?’ షార్ట్ ఫిల్మ్ రిలీజ్…

The Swan Song of Indian Jawan, newsxpress.online
- Advertisement -

హైదరాబాద్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాది సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రదాడికి పాల్పడిన ఘటనలో 45 మందికి పైగా జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన నేపథ్యంలో భారత వాయుసేన నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఆ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడి వాటిని ధ్వంసం కూడా చేసింది. ఈ దాడిలో జైషే మహ్మద్‌కు చెందిన 300-400 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో అల్లర్లకు కారణం ఏమిటి? అసలు ఉగ్రవాదం ఎలా పుట్టుకొచ్చింది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఆపరేషన్ టోపాక్ అంటే ఏమిటి? అలాగే స్వాన్ సాంగ్, బార్బరిక్ కిల్లింగ్ అంటే ఏమిటో వివరిస్తూ హైదరాబాద్‌కు చెందిన భాస్కర్ ప్రొడక్షన్స్ సంస్థ ఇటీవల.. ‘ఏది పవిత్ర యుద్ధం?’- ది స్వాన్ సాంగ్ ఆఫ్ ఇండియన్ జవాన్’ పేరుతో ఒక లఘు చిత్రాన్ని నిర్మించింది.

భాస్కర్ ఐతా, వెంకట లక్ష్మి ఐతాల నిర్మాణ సారథ్యంలో నిర్మితమైన ఈ లఘుచిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు రవిశ్రీ పారిపల్లి నిర్వర్తించారు.

‘ఏది పవిత్ర యుద్ధం?’ లఘు చిత్రాన్ని ఇటీవల టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత తన చేతులమీదుగా విడుదల చేశారు. పాకిస్తాన్ ముష్కరుల దుశ్చర్యలు, భారత జవాన్ల ధైర్య సాహసాలను కళ్లకు కట్టేలా తెరకెక్కించడంలో దర్శక నిర్మాతలు భాస్కర్ ఐతా, రవిశ్రీ పారిపల్లి సఫలీకృతులయ్యారనే చెప్పాలి.

ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు, రక్తాన్ని ఉరకలెత్తించే సంభాషణలు, వాటికి జీవం పోసిన నటినటులు.. మొత్తం మీద తొలి లఘు చిత్రంతోనే ఈ చిత్రబృందం మంచి మార్కులు కొట్టేసింది.

ఏది పవిత్ర యుద్ధం?

- Advertisement -