చిత్రలహరి టీజర్ టాక్! ఈసారైనా తేజు హిట్ పక్కనా?

chitralahari

హైదరాబాద్: సాయిధరమ్ తేజ్ , కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్ జంటగా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎమోషనల్ ప్రేమ కథ గా రాబోతున్న ఈ మూవీ ఏప్రిల్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు.

కొత్తగా ఉన్న సునీల్ పాత్ర…

నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌లో ముఖ్య పాత్రలన్నింటినీ పరిచయం చేసారు. ఈ సినిమాలో తేజూ సరికొత్త లుక్ లో కనిపించడమే కాదు అయన క్యారెక్టర్ కూడా చాల కొత్తగా ఉంది. ఇక సునీల్ మరోసారి తనలోని చమత్కారంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా కనిపిస్తున్నారు.

దర్శకుడు సుకుమార్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్‌లో నివేదా పేతురాజ్‌తో పాత్రల పరిచయం మొదలైంది. ఈ సినిమాలో తేజూ పాత్ర పేరు విజయ్. తన పేరులో ఉన్న విజయం తన జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉండే పాత్ర ఇది.

మొత్తం మీద ఈ టీజర్ లో చూపించిన పాత్రలు అందరికి నచ్చే విధంగా ఉన్నాయి. దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింది. దేవి – కిషోర్ కాంబో లో వచ్చిన నేను శైలజ , ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్రం కూడా అలాగే ఉండబోతుందని అర్ధం అవుతుంది.