ప్రముఖ కేరెక్టర్ ఆర్టిస్ట్ శరణ్య తండ్రి, మలయాళ దర్శకుడు ఆంటోనీ మృతి

- Advertisement -

చెన్నై: ప్రముఖ కేరెక్టర్ ఆర్టిస్ట్, తమిళ, తెలుగు సినిమాల్లో హీరోల త‌ల్లి పాత్ర‌లు చేస్తూ గుర్తింపు పొందిన‌ నటి న‌టి శ‌ర‌ణ్య తండ్రి, ప్ర‌ముఖ మ‌ల‌యాళ‌‌ దర్శకుడు ఆంటోనీ భాస్క‌ర్ రాజ్(95) గుండెపోటుతో మ‌ర‌ణించారు.

చెన్నైలోని విరుగంబ‌క్క‌మ్‌లో కుమార్తె శ‌ర‌ణ్య ఇంట్లో ఉన్న ఆయ‌న నిన్న( ఆదివారం) రాత్రి ఎనిమిది గంట‌ల‌కు గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. నేటి మ‌ధ్యాహ్నం మూడు గంట‌లకు ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వహించారు.

ఆంటోనీ మ‌ర‌ణం ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.  70కు పైగా చిత్రాల‌ను తెర‌కెక్కించిన‌‌ ఆంటోనీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కువ‌గా త‌మిళ‌నాడులోనే జ‌రిగింది.

తొలుత శ్రీలంక‌లో ద‌ర్శ‌కుడిగా ఆయ‌న త‌న కెరీర్‌ను ప్రారంభించారు. ఆ త‌ర్వాత మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టారు. అక్క‌డ‌ స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌లు హిట్ సినిమాలు నిర్మించారు. త‌మిళంలోనూ సినిమాలు రూపొందించారు. 

- Advertisement -