- Advertisement -
హైదరాబాద్: బాలీవూడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..ఆర్ఆర్ఆర్ టీం కు సలహా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఆర్ఆర్ఆర్ సినిమాను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్..రెండో షెడ్యూల్ మొదలు పెట్టగానే చరణ్ గాయాలు పాలవడం..చిత్రంలో సెకండ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ సినిమా నుండి తప్పుకోవడం యూనిట్ కు సమస్య తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం రాజమౌళి సెకండ్ హీరోయిన్ వేటలో ఉన్నారు. కథ పరంగా హాలీవుడ్ హీరోయిన్ అవసరం ఉండడం తో ఆమేరకు ఆ భామల కోసం తెగ ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన స్నేహితురాలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును రాజమౌళికి సూచించినట్టు తెలుస్తోంది.
జాక్వెలిన్ విదేశీ అమ్మాయి కావడంతో పాటు చేసేందుకు బ్రిటిష్ యువతిలా ఉంటుంది కాబట్టి ఆమె పేరును సూచించారట సల్మాన్. ఒకవేళ సల్మాన్ రిఫరెన్స్ ను రాజమౌళి ఓకే చేస్తే ఇద్దరు హీరోయిన్లు బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళే అవుతారు. మరి రాజమౌళి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
- Advertisement -








