21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ నన్ను విమర్శించిన వారికి ఇదే నా సమాధానం: సాయిధరమ్‌ తేజ్!

నన్ను విమర్శించిన వారికి ఇదే నా సమాధానం: సాయిధరమ్‌ తేజ్!

saidarmtej
- Advertisement -

sai dharam tej

హైదరాబాద్ : మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో సతమతమౌతున్నాడు. తనకెరియర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ హీరో , ఆ తరువాత వరుస పరాజయాలతో పూర్తిగా నాభిమానులని నిరాశపరిచాడు.

ఈ సినిమాతో అయినా విజయం అందుకుంటాడా..?

కాగ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తేజు సరసన కథానాయికలుగా కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

తాజాగ ఈ సినిమాను గురించి సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ .. ” తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే కథగా ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. బలమైన కథాకథనాలతో, అనూహ్యమైన మలుపులతో ఆద్యంతం ఆసక్తిరంగా కొనసాగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ కంటెంట్ బాగా కనెక్ట్ అవుతుంది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వరుస పరాజయాల కారణంగా నన్ను విమర్శించిన వాళ్లందరికీ ఈ సినిమా సమాధానం చెబుతుంది అని చెప్పాడు. ఏప్రిల్ 12వ తేదీన ఈ చిత్రలహరి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -