21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీలోకి జంప్ అవుతున్న టీడీపీ కీలకనేతలు! అసలు కారణం ఇదే…

వైసీపీలోకి జంప్ అవుతున్న టీడీపీ కీలకనేతలు! అసలు కారణం ఇదే…

jagan
- Advertisement -

jagan

అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో ఇప్పటికే ఆయా నియోజక వర్గ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు పార్టీ మారటానికి సిద్ధం అయిపోయారు. అయితే వీరు పార్టీ మారటానికి కారణాలు లేకపోలేదు. ప్రతీ ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు ఆరు నెలల ముందే తన నియోజకవర్గంలో సర్వేలు చేయించుకుంటారు.

ప్రభుత్వం పనితీరు ఎలాఉంది? ప్రతిపక్షం ఎలా ఉంది? ప్రజలు ఈసారి ఎవరి పక్షాన నిలబడేందుకు అవకాశం ఉంది? ఇలాంటి అంశాలన్నింటిని బేరీజు వేసుకుని లెక్కలు కడతారు. ఈ లెక్కలు అధికారపక్షానికి అనుకూలంగా ఉంటే అందులోనే ఉండిపోతారు. తేడాగా ఉండే పార్టీ మారతారు. ఇది ఒక లాజిక్.

సర్వేలే ప్రధాన కారణమా..?

అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీ అధినేత వచ్చే ఎన్నికల్లో తమకు సీటు ఇచ్చే అవకాశం లేదని ఉప్పందినా సరే, వెంటనే పార్టీ మారిపోతారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండీ సీటు తెచ్చుకోలేకపోతే అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. ఇక ఇంకొంతమంది మాత్రం ఎంపీగా పోటీ చేయాలనో, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనో పార్టీ మారతారు.

అన్నింటికి మించి, ఇప్పుడు టీడీపీ లీడర్లు అందరూ ఆ పార్టీని వదిలి వెళ్లిపోవడానికి అసలు రీజన్ సర్వేలే. లోకల్ నుంచి జాతీయ స్థాయి వరకు అన్నీ సర్వేలు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు అనూకూలంగా వస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో వైసీపీలోకి వెళ్తే గెలిచినా, ఓడినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే టీడీపీలో ఇబ్బందులు పడుతున్న రాజకీయ నేతలంతా ఇప్పుడు జగన్ పార్టీ వైపు క్యూ కడుతున్నారు.

- Advertisement -