29.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ పుణేలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్!

పుణేలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్!

- Advertisement -

పూణే: నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలోను, అల్యూమినియం ఫ్యాక్టరీలోను వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ప్రధానమైన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

హీరోయిన్స్ ఎక్కడా…

తదుపరి షెడ్యూల్ ను పూణేలో ప్లాన్ చేశారు. అక్కడ షూటింగులో పాల్గొనడానికి ఎన్టీఆర్ .. చరణ్ వెళ్లారు. దాదాపు 45 రోజులపాటు అక్కడ ఏకధాటిగా షూటింగు జరపనున్నట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఈ సీన్స్ వుంటాయని అంటున్నారు. అయితే ఈ షెడ్యూల్లో కూడా అజయ్ దేవగణ్ .. అలియా భట్ పాల్గొనరని చెబుతున్నారు. అక్కడి షెడ్యూల్ ను పూర్తిచేసిన తరువాత, మళ్లీ హైదరాబాద్ లోనే షూటింగు ఉంటుందని అంటున్నారు.

- Advertisement -