29.2 C
Hyderabad
Saturday, August 29, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ఆర్‌ఆర్‌ఆర్ అప్‌డేట్: బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఎన్టీఆర్…

ఆర్‌ఆర్‌ఆర్ అప్‌డేట్: బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఎన్టీఆర్…

- Advertisement -

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ప్రధానపాత్రల్లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా….రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం…ఇటీవల ఇద్దరు హీరోలకి గాయాలవ్వడంతో షూటింగ్‌కి కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం వారి గాయాలు నయం అవ్వడంతో….షూటింగ్ హైదరాబాద్‌లో తిరిగి మొదలైంది.

తాజాగా రాజమౌళి ఎన్టీఆర్‌పై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారని సమాచారం. కొమరమ్ భీమ్ పాత్రలో ఎన్టీఆర్ బ్రిటీష్ సైన్యంతో తలపడే  సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరించారని అంటున్నారు. ఇక ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.

కాగా, కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో న అలియా భట్, అజయ్ దేవగన్ ,సముద్రఖని కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాని జూలై 30 .. 2020వ సంవత్సరంలో విడుదల చేయనున్నారు.

చదవండిఒళ్ళంతా టాలెంట్ ఉన్న వ్యక్తి ఆ హీరోనే…
- Advertisement -