22.8 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ మళ్ళీ వెండితెరపై రేణూ దేశాయ్! హీరో ఎవరో తెలుసా?

మళ్ళీ వెండితెరపై రేణూ దేశాయ్! హీరో ఎవరో తెలుసా?

renudesai
- Advertisement -

హైదరాబాద్: పవర్ స్టార్ “బద్రి” మూవీతో టాలివుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రేణూదేశాయ్ ఆ తర్వాత ‘జానీ’లో నటించింది. పవన్‌కల్యాణ్‌ను పెళ్లి చేసుకుంది. పవన్‌తో బ్రేకప్ తర్వాత ఆమె తన పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే పవర్‌స్టార్‌తో మ్యారేజ్ తర్వాత రేణూదేశాయ్ నటిగా ఎక్కడా కనిపించలేదు. ఆమె హీరోయిన్‌గా చేసింది మూడు సినిమాలే.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమాలో కీలకపాత్రలో…

పవన్‌ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు పూర్తిగా దూరమైన రేణూ దేశాయ్‌ తరువాత పవన్‌ నుంచి విడిపోయిన తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా దూరమయ్యారు. రీసెంట్‌గా మంగలాష్టక్ అనే మరాఠీ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారింది.

ఇటీవల ఓ టీవీ షోతో తెలుగు ప్రజలను పలకరించిన రేణూ, త్వరలో సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా రీ ఎంట్రి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కనున్న బయోగ్రాఫికల్‌ మూవీ‌తో రేణూ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

‘దొంగాట’ ఫేం వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -