విజయవాడ: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…మరో కాంట్రవర్సీకి తెరలేపాడు. ఇప్పటికే దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఓ భాగంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో సంచనాలు సృష్టిస్తున్న వర్మ….సంచలన ప్రకటన చేశాడు.
ఆదివారం విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టిన వర్మ… తన తదుపరి చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని ప్రకటించారు. అయితే మొదట ‘కమ్మ రాజ్యంలో కడప రౌడీలు’ అని ప్రకటించిన వర్మ..తర్వాత ఆ టైటిల్‌ని మార్చాడు.
అయితే విజయవాడ వచ్చిన తర్వాతే తనకు ఈ స్టోరీ ఐడియా వచ్చిందని, విజయవాడ రాగానే బోయపాటి సినిమాలో లా సుమోలు తిరుగుతున్నాయని, కడపలో చూసిన రెడ్లంతా ఇక్కడే ఉన్నారంటూ సెటైర్ వేశారు.
అందుకే, తనకు ఒక ఇన్సిపిరేషన్ వచ్చిందని, ఇక కథ రాయడం మొదలు పెడతానని వర్మ వ్యాఖ్యానించారు.
31న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల…
ఇదిలా ఉంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో నిజం చెప్పేందుకు ప్రయత్నించానని, అది కొంతమందికి నచ్చలేదని, అందుకే, ఈ సినిమా విడుదల కాకుండా అడ్డంకులు సృష్టించారని అన్నారు. ఈ నెల 31న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను విడుదల చేస్తామని, ఈ చిత్రం రాజకీయ అంశంతో కూడుకున్నది కాదని స్పష్టం చేశారు.








