23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ చంద్రబాబుపై మంచు విష్ణు అదిరిపోయే సెటైర్…

చంద్రబాబుపై మంచు విష్ణు అదిరిపోయే సెటైర్…

KCR Latest News, Manchu Vishnu Latest News, Telangana News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీపై వైసీపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు పాలనలో చేసిన తప్పిదాలు వల్లే టీడీపీ దారుణంగా ఓడిపోయిందని విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్‌కి బంధువు, సినీ నటుడు మంచు విష్ణు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై సెటైర్ వేశారు. ఇటీవల ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌ని గుర్తు చేస్తూ..చంద్రబాబుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల మోదీ చేసిన ఓ ట్వీట్ ను ఉటంకిస్తూ చంద్రబాబుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘నారా’ అనే పదంలోని ‘ఎన్’ అంటే నేషనల్, ‘ఏ’ అంటే యాంబిషన్, ‘ఆర్’ అంటే రీజనల్, ‘ఏ’ అంటే ఆస్పిరేషన్స్ … ‘జాతీయ స్థాయిలో ఆశయం, ప్రాంతీయ స్థాయిలోనే ఆకాంక్షలు’ అంటూ ఇలా ప్రధాని ఎవర్ని ట్రోల్ చేశాడో మనందరికీ బాగా తెలుసులెండి అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు.

మొత్తం మీద మంచు ఫ్యామిలీ ఎప్పటి నుంచో చంద్రబాబుకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మోహన్ బాబు కూడా వైసీపీలో చేరి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఓడిపోవడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చదవండివర్మ వదలడుగా: మే 31న ఏపీలో విడుదల కానున్న‘లక్ష్మీస్ ఎన్టీఆర్’…
- Advertisement -