
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ పై రోజు రోజుకూ ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుండటం, రామ్ చరణ్- ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతుండటంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో క్లారిటీ ఇచ్చిన జక్కన్న.. ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు. చిత్రంలో ఆలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా నటించనున్నారని వెల్లడించారు.
అయితే ఆలియా భట్ విషయంలో అంతగా ఎగ్జైట్ కానప్పటికీ.. డైసీ ఎడ్గర్ జోన్స్ విషయంలో అందరూ విస్మయానికి గురయ్యారు. జక్కన అలా ప్రకటించారో లేదో.. ఇంతకీ ఎవరీ డైసీ అని సోషల్ మీడియాలో సెర్చింగ్ మొదలు పెట్టేశారు.
తన నటనతో మెప్పిస్తుందా..?
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మల్టీస్టారర్‌లో డైసీని హీరోయిన్‌గా తీసుకున్నారంటే.. ఖచ్చితంగా ఈమె ప్రత్యేకమైన వ్యక్తే అనే టాక్ మొదలైంది జనాల్లో. అయితే ఇంతకీ ఈ డైసీ ఎవరు? ఆమె గురించిన కొన్ని విషయాలు పరిశీలిస్తే.. ఆమె ఓ బ్రిటిష్ నటి. అంతకుముందు ‘సైలెంట్ విట్నెస్, కోల్డ్ ఫీట్’ వంటి టీవీ సిరీస్‌లలో నటించింది.
గతేడాది ‘పాండ్ లైఫ్’ అనే సినిమాలో కాషీ అనే పాత్రలో నటించింది. దీంతోపాటు ‘ది రిలెక్ట్యుంటె ఫండమెండలిస్ట్’లో నాటకంలోనూ, ‘వింటర్ సాంగ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో కనిపించింది. బ్రిటన్‌లోని మస్వెల్ హిల్స్ ప్రాంతానికి చెందిన నటి ఈమె. ఇక ఈమె ప్రత్యేకతలేంటో వెండితెరపైనే చూడాలి మరి!








