34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ దేవుడా…! ఆ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు పెడుతున్న జక్కన్న…

దేవుడా…! ఆ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు పెడుతున్న జక్కన్న…

RRR secrete says to Rajamouli, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా….దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్..తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా… చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశం ఒక రేంజ్ లో ఉండేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడంటా.

ఇది ఒక భారీ పోరాట సన్నివేశామని తెలుస్తోంది. ఎన్టీఆర్ .. చరణ్ తో పాటు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ యాక్షన్ ఎపిసోడ్‌లో పాల్గొననున్నట్టు సమాచారం. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం 45 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారని సమాచారం.

ఈ సీన్ అభిమానులని కనువిందు చేయనుందని తెలుస్తోంది. ఇక అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కానుంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు.

చదవండి: మహేశ్ సినిమాలో విజయశాంతి పాత్ర ఇదే….!

- Advertisement -