29.3 C
Hyderabad
Friday, October 16, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ జపాన్ బయల్దేరిన ప్రభాస్, అనుష్క! ఎందుకో తెలుసా?

జపాన్ బయల్దేరిన ప్రభాస్, అనుష్క! ఎందుకో తెలుసా?

anushka prabhash
- Advertisement -

anushka prabhash

టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క వరుస సినిమాలు చేస్తూ రావడం వలన, వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుందనే ప్రచారం జరుగుతోంది. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందంటూ అటు అనుష్క, ఇటు ప్రభాస్ చెప్పినప్పటికీ, ఈ పుకార్లు ఆగలేదు.

‘మిర్చి’ సినిమా ప్రమోషన్స్…

ఇక త్వరలో ప్రభాస్ , అనుష్క జపాన్ వెళ్లనున్నారనే వార్త బయటికి రావడంతో, మళ్లీ ఈ పుకార్లు ఊపందుకున్నాయి. అయితే వీళ్లు జపాన్ వెళ్లేది అక్కడ రిలీజ్ కానున్న ‘మిర్చి’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికని తెలుస్తోంది.

‘బాహుబలి’ తరువాత జపాన్ లోను ప్రభాస్, అనుష్కలకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాంతో అంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మిర్చి’ని అక్కడ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రమోషన్స్ లో పాల్గొనమనే అక్కడి డిస్ట్రిబ్యూటర్ ఆహ్వానం మేరకు ఈ ఇద్దరూ వెళ్లనున్నట్టు సమాచారం. ఇక ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ సినిమాను కూడా అక్కడ విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట.

- Advertisement -