24.1 C
Hyderabad
Thursday, October 15, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ రాహుల్! ‘హోదా’ ఎలా ఇస్తారు?: చంద్రబాబుపై ఉండవల్లి విమర్శలు

రాహుల్! ‘హోదా’ ఎలా ఇస్తారు?: చంద్రబాబుపై ఉండవల్లి విమర్శలు

undavalli arun kumar
- Advertisement -

undavalli arun kumar
రాజమహేంద్రవరం: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ప్రధాని అయ్యే అవకాశం లేని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇవ్వగలరని ఆయన ప్రశ్నించారు. ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగిన ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌-సేవ్‌ డెమోక్రసీ’ సదస్సులో ఉండవల్లి పాల్గొన్నారు.

కేంద్రంలో ప్రభుత్వం మారితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని రాహుల్ అన్నారని.. అదెలా సాధ్యమని ఉండవల్లి నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 150కి మించి స్థానాలు రావన్నారు. 250 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే తప్ప రాహుల్ సీఎం కాలేరని ఉండవల్లి అన్నారు.

చంద్రబాబు గొప్పలు…

కాంగ్రెస్‌కు ఏ పార్టీ మద్దతు ఇస్తుందని, హోదా ఎలా ఇవ్వగలుగుతారని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబుపైనా ఉండవల్లి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ఏడు మండలాలను విలీనం చేయడం చంద్రబాబు తన గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

భద్రాచలం ఏపీదేనని, అది లేకుండా ఏడు మండలాలను విలీనం చేయడం వల్ల సాధించిన ఘనత ఏంటని సీఎంను ఉండవల్లి ప్రశ్నించారు. చంద్రబాబు ప్రసంగం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అని, ఆయన ప్రసంగిస్తుంటే హాయిగా నిద్రపోవచ్చని ఉండవల్లి సెటైర్ వేశారు.

- Advertisement -