24.2 C
Hyderabad
Sunday, November 29, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ మా పాత్రలకి ..మా జీవితాలకి ఎటువంటి పోలిక ఉండదు: సమంత

మా పాత్రలకి ..మా జీవితాలకి ఎటువంటి పోలిక ఉండదు: సమంత

Our characters have no comparison with our lives: Samantha, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: నాగచైతన్య కథానాయకుడిగా, సమంత కథానాయికగా శివ నిర్వాణ దర్శకత్వంలో, ‘మజిలీ’ సినిమా నిర్మితమైంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చైతూ – సమంత భార్యాభర్తలుగానే కనిపించనున్నారు.

కుటుంబ కథాచిత్రం…

అందువలన “నిజ జీవితానికీ .. ఈ కథకి మధ్య ఏ విషయంలోనైనా పోలికలు ఉన్నాయా? సంఘటనలు .. సన్నివేశాలు కలిసిన సందర్భాలేమైనా ఉన్నాయా?” అనే ప్రశ్నలు తాజా ఇంటర్వ్యూలో సమంతకి ఎదురయ్యాయి.

అప్పుడు ఆమె స్పందిస్తూ .. ‘మజిలీ’ సినిమాకి .. మా నిజ జీవితానికి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఆ సినిమాలోని పాత్రలకు .. మాకు మధ్య ఎలాంటి పోలికలు వుండవు. ముఖ్యంగా ‘మజిలీ’లో చైతూ పాత్రకు .. ఆయన రియల్ క్యారెక్టర్ కి అసలు సంబంధమే ఉండదు. కథలోని కొత్తదనం కారణంగానే మేమిద్దరం ఈ సినిమాను చేశాము. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడొచ్చు” అని ఆమె చెప్పుకొచ్చారు.

- Advertisement -