33.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ షాకింగ్: మోహన్‌బాబుకి ఏడాది జైలు శిక్ష, రూ.41.75 లక్షల జరిమానా! అసలేం జరిగింది?

షాకింగ్: మోహన్‌బాబుకి ఏడాది జైలు శిక్ష, రూ.41.75 లక్షల జరిమానా! అసలేం జరిగింది?

mohanbabu
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. చెక్‌బౌన్స్‌ కేసులో మోహన్‌బాబుకు ఈ శిక్ష పడింది. శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది.

2010లో చెక్‌బౌన్స్‌ వ్యవహారంలో నిర్మాత వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్‌, ఏ2గా మంచు మోహన్‌బాబు ఉన్నారు.  చౌదరి దర్శకత్వంలో మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘సలీం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మోహన్‌బాబు చౌదరికి ఇవ్వాల్సిన డబ్బు కింద చెక్ ఇచ్చారు.

ఆ చెక్ కాస్తా బౌన్స్ అయింది. రూ.48 లక్షలు చెక్ బౌన్స్ వ్యవహారంపై చౌదరి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  2010లోనే ఈ వ్యవహారంపై కేసు నమోదైంది.  ఈ కేసును విచారించిన జడ్జి మంగళవారం మోహన్ బాబును దోషిగా నిర్ధారిస్తూ.. ఈ మేరకు  శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు.

అయితే దీనిపై మంచు ఫ్యామిలీ ఇంత వరకూ స్పందించలేదు. మోహన్ బాబు తరుపున బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం.

- Advertisement -