

హైదరాబాద్: మెగాడాటర్ నిహారిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం సూర్యకాంతం. ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, నిహారిక జోడీగా రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నాగచైతన్య చేతులమీదుగా ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయించారు.
సూర్యకాంతం’ గా నిహారిక అదరగొడుతుందా….
“ఫ్రైడే నైట్ బేబీ .. పార్టీ నైట్ బేబీ .. గో క్రేజీ .. జస్ట్ గో క్రేజీ .. ” అంటూ ఈ పార్టీ సాంగ్ సాగుతోంది. మార్క్ కె.రాబిన్ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం ఈ పాటను యూత్ కి కనెక్ట్ చేస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దిశగా పనులు జరుగుతున్నాయి. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోన్న ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందని నిహారిక భావిస్తోంది.
ఇకపోతే మధుర శ్రీధర్ నిర్మాణంలో రామ రాజు డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఒక మనసు’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్ నిహారిక. సాఫ్ట్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. అంతకు ముందు ఈ మెగా డాటర్ కొన్ని టీవీ షోస్‌లో యాంకర్‌గా అదరగొట్టింది. అంతేకాదు కొన్ని వెబ్ సిరీస్‌తో అలరించింది ఈభామ.
ఆ తర్వాత విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘ఒరు నల్ల నాల్ పాతు సోలెరన్’ మూవీతో కోలీవుడ్‌లో లెగ్ పెట్టినా, అక్కడా నిహారికకు కలిసి రాలేదు. ఆ తర్వాత సుమంత్ అశ్విన్‌తో కలిసిన నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ మూవీ కూడా నిహారిక ఫేట్‌ను మార్చేలేకపోయింది. నిహారిక ఈ సూర్యకాంతం సినిమాతో అయిన విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
చదవండి: జపాన్ బయల్దేరిన ప్రభాస్, అనుష్క! ఎందుకో తెలుసా?








