నా జాక్స్ నన్ను వీడిపోయింది! పూరీ జగన్నాధ్ భావోద్వేగ ట్వీట్

1:37 pm, Wed, 17 April 19
Capture

హైదరాబాద్: తానెంతో ప్రేమతో పెంచుకున్న శునకం జాక్స్ మృతి చెందిందని చెబుతూ, దానితో తనకున్న జ్ఞాపకాలను పంచుకుంటూ దర్శకుడు పూరీ జగన్నాథ్ భావోద్వేగ ట్వీట్ ను పోస్ట్ చేయగా నెటిజన్లు ఊరడిస్తున్నారు.

సినిమా కష్టాలు తనను చుట్టుముట్టిన వేళ, జాక్స్ ను తన స్నేహితుడి ఇంటికి పంపానని, ఐదేళ్ల తరువాత తాను తిరిగి తెచ్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు. జాక్స్ ను పెంచే పరిస్థితి లేకనే తాను ఆనాడు ఆపని చేశానని, అయితే, జాక్స్ మాత్రం తనను తప్పుగా అర్థం చేసుకుని హర్ట్ అయిందని బాధపడ్డాడు.

జాక్స్ తన వద్దకు వచ్చేవాడు కాదని, తనను చూసి తోక కూడా ఊపడని, తన జీవితంలో ఎంత మందిని బాధించానో తెలియదుగానీ, జాక్స్ ను మాత్రం చాలా బాధపెట్టానని అన్నాడు. వాడింక లేడని, ఇదే చివరి రోజని అన్నాడు. ఇక ఈ పోస్ట్ చదివిన వారంతా, తమ గుండెలు బరువెక్కుతున్నాయని, మీ బాధను అర్థం చేసుకోగలమని, జాక్స్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు.