
హైదరాబాద్: సోషల్ మీడియాలోకి ఇటీవల ప్రవేశించిన చిరంజీవి తన అభిమానులతో రెగ్యులర్ ఉంటూ అలరిస్తున్నారు. అనేక విషయాలు పంచుకుంటున్నారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ఆయన చేసిన కృషిపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ సందర్భంగా ఈ ఉదయం ఓ కెమెరాను పోస్టు చేసిన చిరంజీవి తాను తొలిసారి ఫొటో ఈ కెమెరాతోనే తీశానని పేర్కొన్నారు.
ఈ కెమెరాతో తీసిన ఫొటోను మరికాసేపట్లో ఫొటోను పోస్టు చేస్తానని చెప్పిన చిరంజీవి కొద్దిసేపటి క్రితం ఓ ఫొటోను షేర్ చేశారు. ‘నేను తీసిన మొదటి ఫొటో… ఇందులో ఐదుగురు ఉన్నారు.
వీరిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చూద్దాం’ అని అభిమానులకు సవాలు విసిరారు.
నేను తీసిన మొదటి ఫోటో … … ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు … …చెప్పుకోండి చూద్దాం. #FirstPhotoTaken #WorldPhotographyDay pic.twitter.com/YyesoiiivX
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 19, 2020








