

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గత కొన్ని రోజులుగా వరుస ప్లాపులలో ఉన్నాడు. అయన నటించిన సోగ్గాడే చిన్నినాయనా చివరి సూపర్ హిట్ చిత్రం. ఇకపోతే నాగార్జున సినీ కెరియర్ లో అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలలో ‘మన్మథుడు’ ఒకటి. విందుభోజనం వంటి ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు.
అచ్చొచ్చిన మన్మధుడి మళ్ళీ నిలబెడతాడా….
అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా ‘మన్మథుడు 2’ నిర్మితమవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఎప్పుడు లాంచ్ చేస్తారా అని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వచ్చేనెల 12వ తేదీన ముహూర్తం కుదిరినట్టు సమాచారం.త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట.
కథాపరంగా ఈ సినిమా షూటింగ్ యూరప్ నేపథ్యంలో కొనసాగుతుంది. అందువలన 2 నెలలపాటు అక్కడ షూటింగును ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తోన్న ఈ సినిమాకి, త్వరలోనే కథానాయికను ఫిక్స్ చేయనున్నారు.
చదవండి : వినయ విధేయ రామ అమేజాన్ ప్రైమ్ డేట్ ఫిక్స్ ! ఎప్పుడో తెలుసా!








