నేడు విజయవాడలో ‘మహర్షి’ విజయోత్సవ సభ 

Maharshi Movie Latest News, Mahesh Babu Latest Updates, Tollywood News, Newsxpressonline
- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘మహర్షి’. మహేష్ బాబు కెరియర్‌లో 25వ సినిమాగా రూపొందింది ఈ ‘మహర్షి’.  మెసేజ్ ఓరియెంటెండ్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని  సృష్టిస్తుంది. భారీ అంచనాల మధ్య  మే 9న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.
అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ముందుకుపోతుంది. మహర్షి కేవలం తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కెరియర్‌లో ఫస్ట్ వీక్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీ ఇదే కావటంతో మహేష్ చాలా సంతోషంగా ఉన్నారు.
 

ఒక కంపెనీకి సీఈవోగా, కాలేజ్ స్టూడెంట్‌గా, అలాగే రైతుగా మహేష్ తనని తాను మలచుకున్న విధానం అందరినీ మెస్మరైజ్ చేసింది. 

చదవండి: బిగ్ బాస్ 3లో శ్రీరెడ్డి! ఇక దబిడి దిబిడే!

ఇకపోతే  ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించడమే కాదు, మహేశ్ బాబుకి ఆర్టిస్టుగా కూడా మరింత పేరును తెచ్చింది. భారీ అంచనాల మధ్య బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచిన మహర్షి విడుదలైన తొలిరోజు నుండే బాక్సాఫీస్‌పై దండయాత్ర ప్రారంబించింది.

సినిమాకి పూర్తి పాజిటివ్ మౌత్ టాక్‌తో పాటుగా రివ్యూలు కూడా ఫుల్ పాజిటివ్‌గా ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకులు ఇప్పటికి కూడా క్యూలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మహర్షి’ చిత్ర యూనిట్ విజయోత్సవ సభలలో భాగంగా కొన్ని థియేటర్స్‌కి వెళ్లి అభిమానులని కలిసి వారి స్పందనని తెలుసుకున్నారు.

రేపు ‘గ్రాండ్ సక్సెస్ మీట్’…

కాగా ఇక  చిత్రం గ్రాండ్ సక్సెస్ మీట్‌ను శనివారం సాయంత్రం  విజయవాడలోని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఫంక్షన్ కి సూపర్ స్టార్  మహేశ్ బాబు , పూజా హెగ్డే, అల్లరి నరేశ్ మరికొందరు హాజరుకానున్నారని తెలుస్తోంది.
చదవండి: కొత్త షెడ్యూల్‌కి సిద్ధమవుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’
మహర్షి మహేష్‌కి  ల్యాండ్‌మార్క్ మూవీగా తన కెరీర్‌లో నిలవటంతో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్‌ని మే 18 సాయంత్రం విజయవాడలో నిర్వహించాలని ఫిక్సయ్యారు.
 
దానికి తోడు, ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ముగ్గురు నిర్మాతల్లో ఇద్దరు అశ్వనీదత్‌, పీవీపీ విజయవాడ ప్రాంతానికి చెందిన వారే కావటం కూడా ఈ ఈవెంట్ ఇక్కడ ఏర్పాటు చేయటానికి మరో కారణం అని చెప్పాలి.
 
ఈ కార్యక్రమానికి మహేష్ ఇప్పటివరకు నటించిన సినిమాల డైరెక్టర్స్ , నటీనటులు హాజరుకానున్నారని సమాచారం. చూడాలి మరి వారిలో ఎంతమంది ఈ ఫంక్షన్ కి వస్తారో..

 

- Advertisement -