32.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ సరసన మరోసారి మెరవనున్న కేథరిన్!

స్టైలిష్ స్టార్ సరసన మరోసారి మెరవనున్న కేథరిన్!

Katherine Theresa
- Advertisement -

హైదరాబాద్: అల్లు అర్జున్ నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకోని మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి.

హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా…

గీతా ఆర్ట్స్ , హారిక అండ్ హాసిని వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డేను తీసుకున్నారు. గతంలో ఈ ఇద్దరిలో కాంబినేషన్లో ‘దువ్వాడ జగన్నాథం’ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో మరో కథానాయికగా కేథరిన్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. కేథరిన్ కూడా గతంలో బన్నీతో కలిసి ‘ఇద్దరమ్మాయిలతో’ , ‘సరైనోడు’ సినిమాల్లో నటించింది. ఇటు పూజా హెగ్డే కి , అటు కేథరిన్ కి గ్లామర్ పరంగా మంచి క్రేజ్ వుంది.

అందువలన ఈ సినిమాకి ఈ ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమా త్రివిక్రమ్, బన్నీలకు హ్యాట్రిక్ హిట్ ఇవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

చదవండి: షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2

- Advertisement -