
హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం ‘డిస్కో రాజా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. అయితే రవితేజతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ సంస్థ.
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తేరి సినిమా రీమేక్‌లో రవితేజ నటించనున్నాడు. దీనికి ‘కనకదుర్గ’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. తమిళంలో సమంత, అమీ జాక్సన్ నటించగా, తెలుగులో కాజల్, కేథరిన్ థ్రెసాను ఎంపిక చేసుకున్నారు.
కథ ప్రకారం.. సినిమాలో రవితేజకి భార్యగా కాజల్ కనిపించనుందని సమాచారం. గతంలో కూడా ఈ జంట రెండు సినిమాలకు కలిసి పని చేశారు. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. నిజానికి ఈ సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్‌ని అనుకున్నారు. కానీ పవన్ పాలిటిక్స్‌లోకి వెళ్లిపోవడంతో రవితేజతో కానిచ్చేస్తున్నారు.








